Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-17న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్ర సృష్టిస్తుంది
- విలేకర్ల సమావేశంలో జానారెడ్డి
నవతెలంగాణ-హాలియా
'టీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ నీచమైన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. 17న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ చరిత్ర సృష్టించబోతోంది' అని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరికొత్త రాజకీయ వరవడి సృష్టించడానికి, తెలంగాణలో ఒక మలుపు తిప్పడానికి కాంగ్రెస్కు ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు. అధికార పార్టీ ఆగడాలను ఎదురించే క్రమంలో కొంతమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటు న్నారని, ఎప్పుడూ లేని సంఘటనలు, దారుణాలను తాను చూస్తున్నానని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను టీఆర్ఎస్ కొనుగోలు చేయడం సరికాదన్నారు. తాను చేసిన అభివృద్ధి ప్రజల సాక్షిగా బహిరంగ సభలో గణాంకాలతో సహా వివరించానని, నాగార్జునసాగర్ అభివృద్ధి ఎవరు చేశారో గుర్తించుకొని వారికే ఓటు వేయాలని కోరారు.