Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- 16 నుంచి 18 వరకూ నామినేషన్ల స్వీకరణ
- 19న నామినేషన్ల పరిశీలన
- 20న తిరస్కరణలు
- 22 వరకూ ఉపసంహరణలు
- 30న పోలింగ్
- 3న ఫలితాలు
నవతెలంగాణ- నకిరేకల్
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 30న ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 18 వరకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరిస్తారు. 19న నామినేషన్ల పరిశీలన, 20న తిరస్కరణ ఉంటుంది. 21న తేదీన దాఖలైన వాటిపై పరిష్కరణ, 22న సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసం హరణకు గడువు ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ఎన్. బాలాజీ తెలిపారు.
అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించను న్నట్టు తెలిపారు. ఎక్కడైనా రీపోలింగ్ ఉంటే మే 2న నిర్వహిస్తామని తెలిపారు. 3న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.