Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ మున్సిపల్ నామినేషన్ల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ కేంద్రంలో నామినేషన్ను స్వీకరించేందుకు 20 వార్డులకు గాను 8 కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తొమ్మిది మంది రిటర్నింగ్ అధికారులు, 11 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిజర్వు సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ ఎన్. బాలాజీ నకిరేకల్ సిఐ నాగరాజు ఉన్నారు.