Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
సీపీిఐ ఎంఎల్ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు క్లాస్ స్ట్రగుల్ పత్రిక సంపాదకులు ప్రజాపక్షపాతి మధు మరణం సబ్బండ వర్గాలకు తీరని లోటని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కెమిడి ఉప్పలయ్య , సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు అన్నారు. శుక్రవారం పట్టణకేంద్రంలో మధు చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. సీపీఐ. సీపీఐ(ఎం) నుండి విద్యార్థి సంఘ సభ్యుడిగా, కార్యకర్తగా ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు కమిటీ(విప్లవకారులు) జంటనగరాల కమిటీ కార్యకర్తగా, తన విప్లవకర జీవితాన్ని ప్రారంభించారని చెప్పారు. సంతాపం ప్రకటించిన వారిలో సీపీఐ(ఎం)మండల పట్టణ కార్యదర్శులు మొరిగాడి రమేష్ ,ఎంఏ ఇక్బాల్ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి జూలకంటి పౌల్, నాయకులు వడ్డేమాన్ శ్రీనివాసులు, యేలుగల బాలయ్య ,నమిలే అంజిబాబు ,గడ్డం మంగకయ, తదితరులు పాల్గొన్నారు