Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -భువనగిరి రూరల్
ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతం భువనగిరిఅని, భువనగిరిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని పాదయాత్ర బందం సభ్యులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా సమగ్ర అభివద్ధి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య పాదయాత్రలో భాగంగా శుక్రవారం మండలంలోని హన్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ బీబీనగర్ పోచంపల్లి భువనగిరి బొమ్మలరామారం యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, కార్మికుల యూనియన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే నల్గొండ జిల్లాకు వెళ్లాల్సి వస్తుందన్నారు. జిల్లా కేంద్రం అయినప్పటికీ ఈ ప్రాంతంలో డీసీఎల్ కార్యాలయం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. భువనగిరి,రామన్నపేట లోని అసిస్టెంట్ లేబర్ ఆఫీస్లలో ఇన్చార్జి అధికారుల పాలన కొనసాగుతుందని, వెంటనే రెగ్యులర్ అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత ఉండటంతో నిర్మాణ కార్మికుల పేర్లు వెల్ఫేర్ బోర్డులో నమోదు చేయడానికి ప్రైవేటు సంస్థకు అప్పగిస్తారన్నారు. జిల్లాలో పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని, స్కీం వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.