Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోటకొండూరు : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని కాటేపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల శ్రీనివాస్ (55) వత్తి కూలిపని చేసుకుంటూ అదే గ్రామంలో ఎనిమిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. సరైన దిగుబడి రాకపోవడంతో ఐదు లక్షలకు పైగా అప్పు చేశారు. ఇక అప్పులు కట్టలేనని మనస్తాపనికి గురై గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఇంటి పైన పడుకోవడంతో ఎంతసేపటికి కిందికి రాక పోవడంతో అతని భార్య పైకి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కుటుంబ సభ్యులు భువనగిరిలోని ఏరియాస్పత్రికి తరలించగా అప్పటికే మతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మతుని కుటుంబన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.