Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతదేహంతో కుటుంబసభ్యుల ఆందోళన
నవతెలంగాణ -మోటకొండూర్
భూ తగాదాలతో వ్యక్తిని హత్యచేసిన సంఘటన గురువారం రాత్రి మండల పరిధిలోని అమ్మనబోలు మధిర గ్రామం మోసమ్ బావి (నిమ్మతోట బావి)లో చోటు చేసుకుంది. ఎస్సై డి. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.... మోసమ్ బావికి చెందిన సామ ఎల్లారెడ్డి (55) అదే గ్రామానికి చెందిన గూడూరు సిద్ధారెడ్డికి వ్యవసాయ పొలం వద్ద భూతగాదాలు తరచూ జరుగుతుండడంతో ఎల్లారెడ్డి పైన కక్ష పెంచుకున్న గూడూరు సిద్ధారెడ్డి, అతనికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు గూడూరు రవీందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, విష్ణుకాంత్ రెడ్డి లతో కలిసి గురువారం రాత్రి సమయంలో వ్యవసాయ పొలం వద్ద కర్రలతో దాడి చేయడంతో ఒక స్మారక స్థితిలోకి వెళ్లాడు. సామ ఎల్లారెడ్డిని స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకువచ్చి హత్యకు కారకుడైన సిద్ధారెడ్డి ఇంటిముందు మతదేహాన్ని వేసి మతుని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులు మతుని కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యాదగిరిగుట్ట సీఐ నరసయ్య ఆధ్వర్యంలో ముందస్తుగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పోలీస్ బందోబస్తు నడుమ మతుని అంత్యక్రియలు నిర్వహించారు. హత్యకు కారకులైన నలుగురు వ్యక్తులపైన కేసు నమోదు చేసి చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై. డి. నాగరాజు తెలిపారు.