Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనచైతన్య పాదయాత్ర బదం సభ్యులు రమేష్ నాయక్
నవతెలంగాణ- భువనగిరి రూరల్
గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని సీపీఐ(ఎం) జనచైతన్య పాదయాత్ర బృందం సభ్యులు రమేష్‌నాయక్ కోరారు. జిల్లా సమగ్రాభివద్ధి కోరుతూ జిల్లా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) చేపట్టిన జనచైతన్య పాదయాత్ర శుక్రవారం భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భూమి లకు పట్టాదారు హక్కు పత్రాలు పంపిణీ చేయాలన్నారు. గ్రామపంచాయతీలుగా మారిన తండాలకు నిధులు మంజూరు చేయాలన్నారు. రేషన్ షాప్ లను ఏర్పాటు చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, యాదద్రి లో సేవాలాల్ మందిరం కోసం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. యదద్రి లో బంజారా భవన్ ఏర్పాటు చేయాలని, నారాయణపురం మండలం లోని రాచకొండ ప్రాంతంలో సాగుచేస్తున్న గిరిజనులకు భూమి పత్రాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బస్వాపూర్ ప్రాజెక్టు వల్ల కోల్పోయిన గిరిజనులకు భూమి పత్రాలు పంపిణీ చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, సేవాలాల్ జయంతి ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి ,జయంతికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.