Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుంపల్లి అనురాధ
నవ తెలంగాణ- భువనగిరిరూరల్
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ కోరారు. సీపీఐ(ఎం ఆధ్వర్యంలో చేపట్టిన జనచైతన్య పాదయాత్ర శుక్రవారం ముత్తి రెడ్డి గూడెం చేరుకుంది. గ్రామంలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందిస్తుందో అదేవిదంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవ్వాలని అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మహిళా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దేశంలో, రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు, హత్యలు, లైంగికదాడులను ప్రభుత్వాలు అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు. మహిళల శ్రేయస్సు కోసం తీసుకొచ్చిన నిర్భయ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. నిర్భయ చట్టం నిధులను ప్రభుత్వం రోడ్లు, రైల్వే శాఖకు మళ్ళించడం దుర్మార్గమన్నారు. జిల్లాలోని డ్వాక్రా మహిళా సంఘాలలో మహిళా సంఘానికి రూ.10 లక్షల రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభయ హస్తం బకాయిలను పొదుపు సంఘంలో మహిళలు పొదుపు చేసిన డబ్బు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం చేసిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించి వారి ఆర్థిక అభివద్ధికి సామాజికంగా ఎదిగేందుకు దోహదపడాలని కోరారు.