Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రోజురోజుకు కరోనా తీవ్రంగా ప్రబలుతుండడం చాలా ఆందోళన కలిగిస్తుందని, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి కరోనాను కట్టడి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఆమె మాట్లాడారు.ప్రజల ఆరోగ్య దష్ట్యా ప్రభుత్వం కొన్ని కఠిననిర్ణయాలు తీసుకున్నప్పటికి అనేక మంది నేటికీ మాస్కులు ధరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వ్యక్తులు సామాజికదూరం పాటించాలని కోరారు.కరోనాతీవ్రం కాకుండా అందరూ కలిసి కట్టుగా ప్రయత్నించి నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు.మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరో సారి లాక్డౌన్ విధించే అవకాశం తప్పకపోవచ్చన్నారు.ప్రతిరోజు వందలాదిగా పెరుగుతున్న కరోనా కేసులు, కిటకిటలాడుతున్న ఆస్పత్రుల విషయంలో ప్రతిపౌరుడు ఎవరికి వారే స్వతహాగా ఆలోచించాలని చెప్పారు.