Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని గెమ్యనాయక్ తండా,ఉట్లపల్లి గ్రామాల్లో ఉన్న పోలింగ్‌కేంద్రాలను డీఐజీ రంగనాథ్ శుక్రవారం రిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 69 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మండలంలో మొత్తం 44000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేకుంటున్నట్టు తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా 4,000 పైగా సిబ్బందితో భద్రతా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పోలింగ్ ముగిసే వరకు డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ లాంటి అంశాలపై తనిఖీలు కొనసాగుతాయని ఇందుకోసం ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రూ.50 లక్షల నగదు, రూ.45 లక్షల మద్యం సీజ్ చేయడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద 190 కేసులు నమోదు చేశామన్నారు.ఆయన వెంట సాగర్ సిఐ గౌరినాయుడు, పెద్దవూర ఎస్ఐ సైదాబాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
మండలంలోని ఊటపల్లి, గెమ్యనాయక్తండాలో ఉన్న పోలింగ్‌కేంద్రాలను శుక్రవారం డీఐజీ రంగనాద్ పరిశీలించారు.మండలంలో 26 పంచాయతీలకు సంబంధించిన మొత్తం పోలింగ్ కేంద్రాల పరిశీలిస్తామని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై మండల అధికారులు, పంచాయతీ సిబ్బందితో సమావేశాలు నిర్వహించామన్నారు.రామభద్ర పురం: మిర్తివలసలో పోలింగ్ కేంద్రాన్ని ఎంపీడీవో పి.ఉషారాణి పరిశీలించారు.మండలంలోని నాడు-నేడు పనులు చేపడుతుండగా భవనాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గజపతినగరం: మండల కేంద్రానికి చేరుకొన్న ఎన్నికల మెటీరియల్‌ను మండల పరిపాలనాధికారి పి.సుదర్శనం పరిశీ లించారు.30 పంచాయతీలకు 47 పోలింగ్ కేంద్రాలు, 278 వార్డు బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.
నెల్లిమర్ల: కొండవెలగాడ, చంద్రంపేట, టెక్కలి, పారసాం, బూరాడపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో కె.రాజ్‌కుమార్, తహసీల్దార్ జి.రాము, ఈవోపీఆర్డీ భానోజీరావు పరశీలించారు.మౌలికవసతులపై దష్టి పెట్టాలని గ్రామ కార్యదర్శులకు సూచించారు.వేపాడ: వేపాడ, వల్లంపూడి, నీలకంఠ రాజపురం, బొద్దాం తదితర పోలింగ్‌బూత్‌లను తహసీల్దార్ ఎస్.కష్ణం రాజు, ఎంపీడీవో వెంకటరమణ పరిశీలించారు.బ్యాలెట్ బాక్సులకు మండల అధికారులు సిద్ధం చేస్తున్నారు.శగవరపకోట రూరల్ (జామి): మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ ఎస్.రమణారావు పరిశీలించారు.