Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
ఈ నెల 18వ తేదీన గోవాలో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎన్నకోబడిన చిన్నసూరారం గ్రామానికి చెందిన బెజవాడ సచిన్ అనే జాతీయ స్థాయి క్రీడాకారునికి చేయూతనందించారు. దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మెన్ వడ్త్య దేవేందర్ సహకారంతో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్వీటీ, తాళ్ళ శ్రీధర్ గౌడ్, కోశాధికారి కష్ణకిషోర్ చేతుల మీదుగా శుక్రవారం రూ.15వేలు ఆర్థికసాయం అందజేశారు.ఈ సందర్భంగా అసోసి యేషన్ అధ్యక్షుడు ఎన్వీటీ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన ప్రతి ఒక్క క్రీడాకారునికి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.ప్రతిరంగంలో ప్రతిభ కనబర్చే ప్రతిభావంతులను వెళికితీసి సమాజానికి, దేశానికి అందించడమే స్పోర్ట్స్ అసోసియేషన్ లక్ష్యమన్నారు.వడ్త్య దేవేందర్‌కు స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ భాస్కర్‌రెడ్డి, రాపోలు నిరంజన్, అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్, క్రాంతిమాస్టర్, రాక్‌స్టార్ రమేశ్, వీఎస్.వాసు, ముశిని అంజన్, ఆర్య, జగన్, ప్రేమ్, పవన్, గణేష్ పాల్గొన్నారు.