Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్నారుల పట్ల మరోసారి తన ప్రేమను చాటిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పిల్లలు అంటే తనకు ఎంత ఇష్టమో....వారిపై తనకున్న మమకారాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మరోసారి చాటి చెప్పారు.సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎస్) మండలం బొప్పారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాగ ఇటీవల అకాల మరణం పొందిన విషయం తెలిసిందే.శుక్రవారం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వస్తున్న సమయంలో ఏపూర్ వద్ద తన కోసం మండే ఎండను సైతం లెక్కచేయకుండా చూస్తున్న చిన్నారిని చూసిన మంత్రి తన కాన్వాయ్ ను ఆపాడు.ఇంతటితో ఆగకుండా చిన్నారి బాలుడిని దగ్గరికి పిలిచి చదువు,కుటుంబ బాగోగులను అడిగి తెలుసుకున్నారు.ఐదో తరగతి చదువుతున్నానని మంత్రికి బాలుడు తెలిపాడు. మిమ్మల్ని చూడడడం కోసమే ఎండలో నిల్చున్నానని చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు.ఉన్నత చదువులు చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తేవాలని ఆకాక్షించారు.కచ్ఛితంగా మీరు చెప్పినట్టే ఉన్నత చదువులు చదువుతానని మంత్రికి హామీ ఇచ్చిన బాలుడు మంత్రి వెళ్తున్న సమయంలో టాటా చెప్పాడు.ఈ దశ్యాలను తిలకించిన గ్రామస్తులు పిల్లల పట్ల మంత్రికి ఉన్న మమకారం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు.ఆయన వెంట జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ ఉన్నారు.