Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
గ్రామాల్లో లభించే ఇంటి వ్యర్థాలు, పంటల అవశేషాలను ఉపయోగించి కంపోస్టు, వర్మీకంపోస్టు, నాడెస్ కంపోస్టు తయారీ విధానాలపై గ్రామపంచాయతీ కార్యదర్శులకు, మల్టీపర్పస్ వర్కర్స్, పారిశుధ్య కార్మికులకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ శుక్రవారం తెలిపారు. ఎంపీపీ పెండెం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మండలంలోని 32 గ్రామాలకు చెందిన కార్యదర్శులు, ఇతర సిబ్బందికి క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ శిక్షణ ఇప్పించి చెత్త నుంచి కంపోస్టు తయారు చేయడం, తయారైన కంపోస్టును ఉపయోగించి నర్సరీల పెంపకం చేపట్టడం, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఈ అవగాహన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ప్రతి గ్రామంలో కంపోస్టు యార్డు, నాడెస్ కంపోస్టు యూనిట్లు నిర్మించబడి ఉన్నాయన్నారు.సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్, ఇతర యూనిట్లు నిర్మించబడి ఉన్నాయన్నారు.సేకరించిన చెత్త నుంచి ప్లాస్టిక్, ఇతర కుళ్లు వ్యర్థాలను వేరుచేసి కుళ్లింపబడే వాటిని కంపోస్టుకు వినియోగిస్తున్నామన్నారు.గ్రామాల్లో లభించే చెత్తను వివిధ పద్ధతుల ద్వారా కంపోస్టుగా చేసి పెరటిలో కూరగాయల పెంపకానికి సేంద్రీయ ఎరువుగా వినియోగించుకోవచ్చని, స్వచ్ఛభారత్‌ను సాధించేందుకు స్వచ్ఛ గ్రామాలుగా ముందుండాలని కేవీకే కార్యదర్శి డాక్టర్ ఘంటా సత్యనారాయణరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి వివిధ కంపోస్టు తయారీ పద్ధతులు నాడెస్ కంపోస్టు, వర్మీకంపోస్టు తయారీ, వేస్ట్ డే కంపోజర్ తయారీ వినియోగం, కంపోస్టింగ్‌కు ఉపయోగపడే జీవ సంబంధ శిలీంధ్ర ఎరువుల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి చిత్రప్రదర్శన, క్షేత్ర ప్రదర్శన కలిగించి అవగాహన కల్పించామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ తెలిపారు.అనంతరం సిబ్బంది కేవీకేలో చేపడుతున్న కంపోస్టు వర్మీకంపోస్టు, అజోల్లా, జీవామతం, వర్మీవాష్, వర్మీబెడ్ యూనిట్లు సందర్శింపజేసి వివరించామని కేవీకే శాస్త్రవేత్త ఎ.కిరణ్ వివరించారు.ఈ కార్యక్రమంలో గరిడేపల్లి ఎంపీఓ లావణ్య, 32 గ్రామాల కార్యదర్శులు, మల్టీపర్పస్ వర్కర్స్, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.