Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటరింగ్ డే కార్యక్రమంలో సిబ్బంది తప్పక పాల్గొనాలి
- అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీ ప్రత్యేక చొరవ చూపాలి
- కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
పట్టణంలోని 5 వ వార్డు దురాజ్‌పల్లిలో జరిగిన వాట రింగ్డేలో కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పి.అన్నపూర్ణతో కలిసి మొక్కలకు నీరు పోశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత వార్డు కౌన్సిలర్,వార్డు ఆఫీసర్, ఆయా గ్రామపంచాయతీలదేనన్నారు.ఎండలతీవ్రత ఎక్కువగా ఉన్నందున మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఆ దిశగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.నాటిన మొక్కలకు పాదులు తీయించుట, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించా లన్నారు.ప్రతి శుక్రవారం చేపట్టే వాటరింగ్డే కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది తప్పక పాల్గొనాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె.రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ పి.రామాజనేయరెడ్డి, 5వ వార్డు కౌన్సిలర్ భాషా, మున్సిపల్ ఈఈ జి.కె.డి.ప్రసాద్, డీఈ సత్యారావు, ఏఈ సుమంత్, ఎస్ఎస్ఆర్.ప్రసాద్ పాల్గొన్నారు.