Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్షం రోజుల్లో నిల్వ ఉన్న ధాన్యానికి కాంటా వేస్తాం
- తక్కువ ధాన్యం కొంటున్నామని రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తా
- మార్కెట్ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ధాన్యం కొనుగోలు ప్రారంభించిన నాలుగురోజుల్లోనే 26,516 బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని మార్కెట్ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఈ నెల 9న కొనుగోళ్లు ప్రారంభిం చామన్నారు.అదేరోజు నాలుగువేల బస్తాల ధాన్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేశామన్నారు.10వ తేదీన 7335 బస్తాలు, 12న 7260, 15న 7921 బస్తాల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.13వ తేదీన ఉగాది పండుగ, 14వ తేదీన అంబేద్కర్ జయంతి ఉండటం వల్ల మార్కెట్లో హమాలీలు పనికి రాకపోవడంతో కాంటాలు వేయ లేదన్నారు. మార్కెట్ యార్డ్ పరిధిలో 50 ఐకేపీ, 37 ప్రాథమిక సహకారసంఘం కేంద్రాల ద్వారా దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలుచేస్తున్నామన్నారు.అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, తేమశాతం లెక్కించే యంత్రాలు అందుబాటులో ఉంచా మన్నారు. అకాల వర్షం వల్ల ధాన్యం తడవకుండా ఉండేందుకు రెండు వేల టార్ఫాలిన్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 1700 టార్పాలిన్లు రైతులకు అందించామన్నారు.ఈ సమావేశంలో జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ బంటు శ్రీనివాస్, మార్కెట్ డైరెక్టర్ పులిజగదీశ్, పాదూరు సంజీవరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్లు ఆదిరెడ్డి, వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మట్టపల్లి సైదులుయాదవ్ పాల్గొన్నారు.