Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాకారులకు ప్రవేశ రుసుము లేదు
- విజేతలకు నగదు బహుమతి, జ్ఞాపికలు
- పారిశ్రామికవేత్త రంగా శ్రీధర్
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియం షటిల్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు ముస్తాబు కానుంది.బ్యాడ్మింటన్ క్రీడాకారులను అనునిత్యం ప్రోత్సహిస్తూ బ్యాడ్మింటన్ ఆటకు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రంగా శ్రీధర్ వన్నె తెచ్చారు.ఆర్ఎస్ లిటిల్ ఛాంప్స్ క్లబ్‌ను స్థాపించి చిన్నారుల్లో ఉన్నక్రీడా నైపుణ్యాలను వెలికి తీస్తున్నారు. ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల మేథస్సును డీఎస్ఏ కోచ్ రామకష్ణ పదునుపెట్టించి జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యేలా కీలక భూమిక పోషిస్తున్నారు.డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అలవోకగా రాణించడంతో పాటు, ప్రతిష్టాత్మక గోపిచంద్ అకాడమీకి సైతం ఎంపికై మిర్యాలగూడ నియోజకవర్గ కీర్తి ప్రతిష్టలను ఎలుగెత్తి చాటుతున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని క్రీడా ఆణిముత్యాలను వెలుగులోకి తేవాలనే ధడ సంకల్పంతో రంగా శ్రీధర్ స్థాపించిన ఆర్ఎస్ లిటిల్ ఛాంప్స్ క్లబ్ షటిల్, బ్యాడ్మింటన్ క్రీడకు జీవం పోసింది. క్రీడాకారుల వద్ద నుంచి ఎలాంటి రుసుము స్వీకరిం చకుండా ఛాంపియన్ షిప్ నిర్వహించడం ఆర్ఎస్ లిటిల్ ఛాంప్స్ ప్రత్యేకత. ఈ నెల18న మిర్యాలగూడ పట్టణ స్థాయి ఆర్ఎస్ సీనియర్ కప్ మొదటి సీజన్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రంగా శ్రీధర్ తెలిపారు. ఇండోర్, అవుట్ డోర్ క్రీడాకారులను వేర్వేరుగా ఆడించనున్నట్టు తెలిపారు.బ్యాడ్మింటన్ క్రీడాకారులను మాలిస్ 350 ప్లాస్టిక్ షటిల్‌తో ఆడిస్తామన్నారు.ఈ నెల18న క్రీడాకారులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇండోర్ స్టేడియానికి చేరుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, తమ వెంట శానిటైజర్ తెచ్చు కోవాలన్నారు.నాన్ మార్కింగ్ షూ ధరించి టోర్నమెంట్ ఆడాలని, నాన్ మార్కింగ్ షూ లేకుండా వచ్చేవారిని షూ లేకుండా ఆడిస్తారని చెప్పారు. అయితే, జిల్లా స్థాయి షటిల్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఎట్టి పరిస్థితుల్లో టోర్నమెంట్ ఆడేందుకు అనుమ తించమన్నారు. ఇండోర్ క్రీడా కారుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో విజేతగా నిలిచి నట్టయితే రూ.4,016 నగదు బహు మతితో పాటు, జ్ఞాపిక, ద్వితీయ, తతీయ, చతుర్ధ స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.3,016, రూ.2,016, రూ.1,016 నగదు బహుమతులతో పాటు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు. అవుట్ డోర్ క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఔట్ డోర్ గేమ్‌లోనూ ప్రతిభ కనబర్చిన ప్రథమ స్థానం విజేతకు రూ.4,016 నగదు బహుమతితో పాటు, జ్ఞాపిక అందజేస్తామన్నారు. అవుట్ డోర్ బ్యాడ్మింటన్ గేమ్‌లో ద్వితీయ, తతీయ, చతుర్ధ స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.3,016, రూ.2,016, రూ.1,016 నగదు బహుమతులతో పాటు, జ్ఞాపికలు అందజేస్తామన్నారు. టోర్నమెంట్ విజేతలకు బ్రాండెడ్ టీ-షర్టులు కూడా బహుకరిస్తామని రంగా శ్రీధర్ తెలిపారు.ఆర్ఎస్ లిటిల్ ఛాంప్స్ సీనియర్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు పోటీ పడుతున్న ఔత్సాహికులంతా 17వ తేదీ మధ్యాహ్నంలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇండోర్ క్రీడాకారులు పేర్ల నమోదు కోసం 9948590373 సెల్ నెంబర్లో, ఔట్ డోర్ క్రీడాకారులు 8978945644 సెల్ నెంబర్లో సంప్రదించి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని రంగా శ్రీధర్ తెలిపారు.