Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతి ఒక్కరూ మాస్క్‌ను ధరించడం ద్వారా కరోనాను నివారించొచ్చని ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారు. ఈ మేరకు మాస్క్ ప్రాధాన్యతను తెలుపుతూ శనివారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత రక్షణ, శుభ్రత పాటించాలని సూచించారు. వైరస్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు.రద్దీ ప్రాంతాల్లో, ప్రయాణ సమయంలో, మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌కు వచ్చినప్పుడు ఒకరికొకరు విధిగా సామాజికదూరం పాటించాలని సూచించారు. మాస్క్ వినియోగం, సామాజికదూరం పాటించడంపై జిల్లా పోలీసు శాఖ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా మాస్క్ ధరించకపోతే ప్రభుత్వ ఆదేశానుసారం రూ. 1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమలో ఆర్ఐలు గోవిందరావు, నర్సింహారావు పాల్గొన్నారు.