Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన సంఘటన నాగార్జునసాగర్‌లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాగార్జునసాగర్ హిల్కాలానికి చెందిన రషీద్(49), మల్లయ్య(45) ఇద్దరు మాచర్ల వైపు నుండి హిల్‌కాలనీకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అటుగా పైలాన్ కాలనీకి చెందిన రమావత్ బంగారి(36) కొత్త బ్రిడ్జి దగ్గర తన ఇంటి వైపు బజార్ వైపు నుండి వస్తుండగా కొత్త బ్రిడ్జి దగ్గరలో ఉన్న మసీదు వద్ద నున్న ములమలుపు వద్దకు రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మతి చెందారు.ముగ్గురి మతితో కమలా నెహ్రూ దవాఖానలో బంధువుల రోదనతో కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.