Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అనంతగిరి
రైతుపై హమాలీ దాడి చేసిన సంఘటన మండలంలోని ఖానాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఖానాపురం గ్రామానికి చెందిన గుండ్లపల్లి రామారావు ధాన్యం దిగుమతి చేసేందుకు గ్రామశివారులోని జయలక్ష్మి పార్బాయిల్డ్ మిల్లుకు వచ్చాడు.అదే గ్రామానికి చెందిన కంటు ఉపేందర్ మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు.ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన ఉపేందర్ కర్ర తీసుకుని రామారావుపై దాడికి పాల్పడ్డాడు.దీంతో ఆగ్రహించిన రైతులు మిల్లు ఎదుట ధర్నాకు దిగారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి రైతులతో మాట్లాడారు.దాడికి పాల్పడిన ఉపేందర్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.ఈ విషయంపై మిల్లు యజమాని వెంపటి మధుని వివరణ కోరగా గొడవకు మిల్లు యాజమాన్యానికి సంబంధం లేదన్నారు.గతంలో ఇద్దరి మధ్య ఉన్న పాతకక్షలే గొడవకు కారణమని తెలిపాడు.