Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేతెపల్లి:సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు పొందవచ్చని డీఆర్డీఏ ఏపీడీ శైలజ పేర్కొన్నారు.శనివారం మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంపోస్ట్ ఎరువులషెడ్ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో తడి, పొడి చెత్త లను వేరు చేసి కంపోస్టు ఎరువుగా మార్చినట్టయితే ఎరువుగా పంటపొలాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామాలలో పరిశుభ్రతను పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా అధికారి ఎస్డి. మోయినుద్దీన్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, ఈఓఆర్డీ వెంకటేశ్వర్లు, ఈజీఎస్ ఏపీఓ ఆర్.రామ్మోహన్, సర్పంచ్ బచ్చు జానకిరాములు, పంచాయతీ సెక్రెటరీ జి.నాగమణి పాల్గొన్నారు.