Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గులపల్లి
మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.మండలంలో మొత్తం ఏడు గ్రామాల్లో 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7233 మంది ఓటర్లుండగా అందులో పురుషులు 3425, మహిళలు 3306 మంది ఉన్నారు. ఉదయం నుంచి ఆయా పోలింగ్‌కేంద్రాల వద్ద ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు.ఎండను సైతం లెక్క చేయకుండా ఓటింగ్‌లో ఉత్సా హంగా పాల్గొన్నారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.కోవిడ్ నేపథ్యంలో మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పోలింగ్ నిర్వహించారు. ఆరోగ్య సిబ్బంది కేంద్రాల వద్ద ఓటర్లకు శానిటైజ్ చేశారు.వద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు కేంద్రాలకు రాగా రెవెన్యూ, పోలీసు అధికారులు సేవలందించారు.సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి మొత్తంగా 93.06 శాతం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.మొత్తం 7233 మంది ఓటర్లకు గాను 6731 మందికి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు.
నాగార్జునసాగర్:నాగార్జునసాగర్‌లో ఎన్నికల పోలింగ్ శనివారం ప్రశాంతంగా ముగిసింది.హిల్‌కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన బూతులో ఏజెంట్ లేకపోవడంతో ఎన్నికలు అరగంట ఆలస్యంగా ప్రారం భమైంది.హిల్‌కాలనీలోని 99 బూతులో మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుండే బారులుతీరారు.సాగర్ పైలాన్‌కాలనీ, హిల్‌కాలనీలోని బూ తులలో ఎన్నికల సరళిని ఏర్పాట్లను ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్,ఎన్నికల అబ్జర్వర్ సజ్జన్‌సింగ్, పోలీస్ అబ్జర్వర్ సునీల్ కుమార్మీనన్లు, ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు.
నిడమనూరు:మండలంలో శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. మొత్తంగా 88 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో మొత్తం 29 పంచాయతీలు ఉండగా 34,256 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 16,877 మంది కాగా మహిళలు 17379 ఉన్నారు. మొత్తం 346 బూతుల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోవిడ్ కారణంగా కొంత మంది ఓటర్లు భయపడి ఉదయం సమయంలో ఓటుకు దూరంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం బాగానే పెరిగింది. ఉదయం 11 గంటల వరకు 31 శాతం పోలింగ్ నమోదవగా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 50.1 శాతం, 3 గంటల వరకూ 60 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటలకు 81.5 శాతం ఓట్లు నమోదు కాగా ఎన్నికలు ముగిసే సమయానికి మొత్తం 88 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ కోవిడ్ నిబంధనలు అమలు చేశారు.
పెద్దవూర :నాగార్జున సాగర్ ఉపఎన్నికలు పెద్దవూర మండలంలో ప్రశాంతంగా ముగిసాయి.మొ త్తంగా 86 శాతం పోలింగ్ నమో దైంది. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. మండలంలో మొత్తం 44786 మంది ఓటర్లు ఉండగా 34,739 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో పురుషులు 17358 మంది, మహిళా ఓటర్లు 17351 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 77.57 శాతం పోలింగ్ నమోదైంది. కోవిడ్ నిబంధనల ప్రకారం ఓటర్లకు మాస్కులు, శాని టైజర్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
తిరుమలగిరి సాగర్ :ఉపఎన్నికలు తిరుమలగిరి సాగర్ మండలంలో ప్రశాంతగా ముగిసాయి. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా మొత్తం 34 గ్రామ పంచాయతీల్లో 48 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఓటర్లకు మాస్కులు, శాని టైజర్లు పంపిణీ చేశారు.