Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో పనిచేస్తున్న ఐసీడీఎస్ సిబ్బంది పోషణట్రాక్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నర్సింహారావు కోరారు.శనివారం కలెక్టరేట్లోని ఐసీడీఎస్ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో జిల్లాలోని అంగన్వాడీ సీడీపీవోలకు, సూపర్వైజర్లకు, పోషణ్ అభియాన్ సిబ్బందికి పోషణ్ ట్రాకర్ అనే మొబైల్ యాప్‌పై రాష్ట్ర సంచాలకులు దివ్య ఆదేశాల ప్రకారం పోషణ్‌ట్రాకర్ యాప్ ఆవశ్యకత, దాని వినియాగంపై జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1204 అంగన్వాడీ టీచర్లు ఇప్పటికే ఈ యొక్క యాప్ వారి సెల్‌ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్నారన్నారు.ఈ యాప్ వినియోగం ద్వారా అంగన్వాడీ సేవలు ప్రతి లబ్దిదారులకు మరింత చేరువ అవుతాయని, మహిళ,శిశువుల పర్యవేక్షణ వారి వివరాలు గతంలో కంటే ఈఆన్లైన్ పద్ధతి ద్వారా సరైన సమయంలో సరైన సేవలు సులభతరం అవుతూ టీచర్లకు పనిభారం తగ్గుతూ రియల్ టైం మానిటరింగ్కి దోహదపడుతుందన్నారు.తద్వారా జిల్లాలో పోషన్ లోపం, రక్తహీనత, వయస్సు కు తగిన ఎత్తు,బరువు ఉండని వారి సంఖ్య తగ్గించు కోవాలన్నారు.సరైన పోషణ ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కషి చేయాలని తెలిపారు. అంతకుముందు వయోవద్ధుల, వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఉపకర్ణములు పంపిణీ కార్యక్రమాన్ని వెబినర్ ద్వారా జిల్లా వికలాంగుల సంఘం ప్రతినిధుల సమక్షంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వీక్షించి ప్రసంగించారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.నర్సింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తుందన్నారు. జిల్లాలోని వికలాంగులు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని వినియోగిం చుకొని మనోధైర్యంతో ముందుకు నడవాలని, త్వరలో జిల్లాలోలోని అర్హులైన వికలాంగులకు ఉపకర్ణముల పంపిణీ కార్యక్రమం త్వరలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త సంపత్, సీడీపీవోలు వెంకటలక్ష్మి, శ్రీవాణి, కిరణ్మయి, శ్రీజ, రూప, నాగమణి, జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.