Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1955 నుంచి 2020 వరకు సర్పంచుల పాలన
- మొదటి సర్పంచ్ పుల్లారెడ్డి
- చివరి సర్పంచ్ రంగమ్మ
- 2020 డిసెంబర్ 16 నుంచి పురపాలన
నవతెలంగాణ-నకిరేకల్
గ్రామపంచాయతీగా ఉన్న నకిరేకల్ విద్యా, వైద్యం, వ్యాపార పరంగా రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో నకిరేకల్ గ్రామపంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. 1955లో గ్రామ పంచాయతీగా ఏర్పడిన నకిరేకల్‌కు ప్రప్రథమంగా పన్నాల పుల్లారెడ్డి (సీపీఐఎంఎల్) సర్పంచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత పన్నాల సావిత్రమ్మ, గడ్డం ఇంద్రసేనారెడ్డి సర్పంచులుగా పనిచేశారు. కొండ నాగులు (సీపీఐ(ఎం)) రెండు పర్యాయాలు, రాచకొండ సైదులు గౌడ్ (కాంగ్రెస్) రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. 2001లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన సకినాల రవికుమార్ గెలుపొంది 2006 వరకూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రాచకొండ బిక్షమమ్మగౌడ్ 2006 నుంచి 2011 వరకు సర్పంచ్‌గా పని చేశారు. ఆ తర్వాత నకిరేకల్ గ్రామపంచాయతీలో మరో ఆరు గ్రామాలను విలీనం చేయడంతో ఆగస్టు 2011 నుంచి సెప్టెంబర్ 2013 వరకు మున్సిపల్ పాలన సాగింది. మండలంలోని ఆరు గ్రామాలను నకిరేకల్ మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నకిరేకల్ మున్సిపాలిటీని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ క్రమంలో నకిరేకల్‌తో పాటు విలీనమైన గ్రామాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి ఎన్నికలు నిర్వహించారు. 2015 డిసెంబర్లో నకిరేకల్ మేజర్ గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ నుంచి పన్నాల రంగమ్మ సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆమె పదవీ కాలం 2020 డిసెంబర్ 15తో ముగియడంతో డిసెంబర్ 16 నుంచి నకిరేకల్ పట్టణంలో పురపాలన ప్రత్యేక అధికారులతో సాగుతుంది.
మొత్తం వార్డులు 20
మున్సిపాలిటీ వివరాలు
జనాభా 29126
పురుషులు 14345
స్త్రీలు 14781
మొత్తం ఓటర్లు 21035
పురుషులు 10342
స్త్రీలు 10693
ఎస్టీలు 88
ఎస్సీలు 2615
బీసీలు 14884
ఇతరులు 3448
సరిహద్దులు
తూర్పు ఇనుపాముల
పడమర చందంపల్లి
ఉత్తరం నోముల
దక్షిణం చందుపట్ల