Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోత్కూరు: మున్సిపల్ కేంద్రంలోని ఓ వైన్‌షాపులో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ జి.ఉదరుకిరణ్ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపల్ కేంద్రంలో పోతాయగడ్డ మెయిన్ రోడ్డుకు ఉన్న సునీత వైన్‌షాపు తాళాలను శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షట్టరు గడ్డపారతో లేపి షాపులోకి చొరబడ్డారు. దొంగలు చాకచక్యంగా షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని పైకి లేపారు. దుకాణంలో ఉన్న కౌంటర్ టేబులను షాపు పక్క సందులోకి తీసుకెళ్లి దాన్ని పగుల కొట్టి అందులో ఉన్న రూ.10 వేలను ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించింది. వైన్ షాపులో పని చేస్తున్న సేల్స్ మెన్ నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టుఎస్ఐ తెలిపారు.