Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పక్కన చికెన్ వ్యర్థల పడవేత
- దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు
నవతెలంగాణ-బొమ్మలరామరం
మండలంలో మర్యాల గ్రామంలో చికెన్ షాప్ యజమానులు భువనగిరి వెళ్లి రహదారి పక్కన చికెన్ వ్యర్థాలను పడేస్తున్నారు. కొంత కాలంగా రోడ్డు పక్కనే వేస్తుండడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వేదజల్లుతుంది. అటు వైపు వెళ్లే ప్రయాణికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు ప్రధాన రోడ్డు పై గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ చేస్తున్నప్పటికీ చికెన్ షాప్ యజమానులు నిర్లక్ష్యంగా రోడ్డు పై పారబోస్తున్నారు. దీని వల్ల రోగాలు రావడమే కాకుండా రోడ్ల పై కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతుండంతో ప్రయాణం ప్రమాదంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.