Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మలరామారం : నీటికుంటలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని చీకటి మామిడి పంచాయతీ పరిధిలోని కంచల్తండాలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చీకటి మామిడి రెవిన్యూ కంచల్ తండా ప్రాంతంలో తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండాకు చెందిన రమేష్ నాయక్(32) అనే వ్యక్తి కంచల్ తండాలో ఓ మహిళ మతి చెందడంతో అంత్యక్రియలకు వచ్చారు. అనంతరం స్నానం చేసేందుకు కుంటలోకి దిగాడు. బయటికి రాలేదు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఎస్ఐ వెంకటన్న సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాడు. వ్యక్తి మృతదేహం కోసం నీటి కుంటలో గాలింపు చర్యలు చేపట్టారు.