Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దామరచర్ల
మండలంలో శనివారం 135 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు. ఇందులో పవర్ ప్లాంట్‌లో పని చేసే ఏడుగురు, రాళ్లవాగుతండా, రాశి సిమెంట్ ,డెక్కన్ సిమెంట్స్లల్లో ఒకొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
నకిరేకల్ :నకిరేకల్ ప్రభుత్వాస్పత్రిలో 124 మందికి, ఓగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిది మందికి శనివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 22 మందికి పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16 మంది నకిరేకల్ మండలానికి చెందిన వారు కాగా ఆరుగురు ఇతర మండలాలకు చెందిన వారని తెలిపారు.
చండూరు : మండలంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు మండల వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు. 62 మందికి కరోనా టెస్టులు చేయగా మండల కేంద్రానికి చెందిన ఆరుగురికి, గట్టుపల్ గ్రామంలో 01, తేరట్పల్లి 01, సిద్దేపల్లి 01, అంగడిపేట గ్రామంలో ఒక కేసు నమోదైనట్టు తెలిపారు.