Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నకిరేకల్
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులకు శనివారం 86 మంది అభ్యర్థులు 89 నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటో వార్డుకు అత్యధికంగా 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండో వార్డుకు ఐదు, మూడో వార్డుకు 7, నాలుగో వార్డుకు 3, 5వ వార్డుకు నాలుగు, 6వ వార్డుకు 2, 7వ వార్డుకు 8, 8వ వార్డుకు 2, 9,10వ వార్డులకు ఐదు చొప్పున, 11వ వార్డుకు మూడు, 12వ వార్డుకు రెండు, 13వ వార్డుకు 3, 14వ వార్డుకు రెండు, 15, 16, 17 వార్డులకు నాలుగు చొప్పున, 18వ వార్డుకు ఒకటి, 19, 20 వార్డులకు 7 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.