Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
అవినీతిపై బ్రహ్మాస్త్రం సమాచార హక్కు చట్టమని సమాచార హక్కు ప్రజాచైతన్య సమితి కోర్ కమిటీ సభ్యులు బాబురావు, ఎమ్‌డి.లతీఫ్‌ఖాన్, ఎన్నమళ్ల భాస్కర్, కొండ వెంకటలక్ష్మి, జిట్టా నర్సింహారాజు అన్నారు. శనివారం స్థానిక మండల జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో సమాచార హక్కు చట్టం - 2005పై అవగాహన కల్పించారు. అనంతరం ఆ సమితి నియోజకవర్గ, మండల కమిటీలను ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షునిగా లోకసాని మన్మధరెడ్డి, ఉపాధ్యక్షునిగా నర్సింహా, ప్రధాన కార్యదర్శిగా జిల్లా రాములుతో పాటు కార్యవర్గ సభ్యులుగా బోశెట్టి సుజాత, శ్రీధర్, కంబాలపల్లి ఇద్దయ్య, సయ్యద్ సాథిక్, నిమ్మల పద్మ, అంకూరి వెంకట్, ధర్మనాయక్, శేరిపల్లి శ్రీకాంత్, జిల్లా అంజలి, రాచమల్ల సాయి, యాదగిరి, పున్న దినేశ్, అడిశర్లపల్లి శ్రీనివాసచారిలను నియమించారు. అదే విధంగా దేవరకొండ, పెద్దఅడిశర్లపల్లి, చందంపేట, డిండి, నేరేడుగొమ్ము మండలాల కన్వీనర్లను ఎన్నుకున్నారు.