Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మండల వైద్యాధికారి నాగునాయక్ అన్నారు.శనివారం మండలపరిధిలోని కర్విరాల, రామచంద్రపురం గ్రామాలలో మొబైల్ టీం ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించి మాట్లాడారు.112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్కరికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందన్నారు.తుంగతుర్తి ప్రాంతీయ వైద్యశాలలో 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేస్తున్నట్టు తెలిపారు.ఈ అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ సముద్రాలసూరి, హెల్త్అసిస్టెంట్లు గాజుల సోమయ్య, తాటిపాముల నర్సింహాచారి, వేణుగోపాల్, ఏఎన్ఎంలు ఉపేంద్ర, దేవేంద్ర, తడకమళ్ళ మల్లికార్జున్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల: కరోనా వైరస్ వ్యాప్తి లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత రక్షణ, శుభ్రత పాటించాలని, వైరస్ నిర్మూలనలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, ఎస్సై యాదావెందర్ రెడ్డి అన్నారు. ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని కోరినారు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణ సమయంలో, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ కి వచ్చినప్పుడు ఒకరికొకరు భౌతిక దూరం పాటించాలని మాస్క్ వినియోగం భౌతిక దూరం పాటించడం పై జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు, జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. బయటకు వచ్చేటప్పుడు మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా తప్పదని ఎస్.ఐ.యాదావెందర్ రెడ్డి హెచ్చరించారు.
హుజూర్నగర్ :ప్రతి ఒక్కరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చన రవి అన్నారు.శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కరోనా రెండోదశ విసృత్తంగా ఉన్న ఈ సమయంలో ప్రతిఒక్కరూ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి సామాజికదూరం పాటించా లన్నారు.కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో గెల్లి రవికుమార్, మున్సిపల్ వైస్‌చైర్మెన్ జక్కుల నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.