Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జనం
- హాజరైన తమ్మినేని, మల్లు, ఆశయ్య
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్రాభివద్ధి కోరుతూ జిల్లా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మార్చి 23వ తేదీన రామన్నపేటలో ప్రారంభించిన జన చైతన్య పాదయాత్ర సుమారు 26 రోజుల పాటు కొనసాగి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభతో విజయవంతంగా ముగిసింది. జన చైతన్య పాదయాత్ర జిల్లాలోని 15 మండలాల్లో విజయవంతంగా పూర్తి చేసుకొని సుమారు 785 కిలోమీటర్లు, 170కి పైగా గ్రామాలను కలుపుకొని గ్రామాలలోని ప్రజా సమస్యలను తెలుసుకొని , వాటి సమస్య రానికి భవిష్యత్ కార్యాచరణను బహిరంగ సభలో రూపొందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాసీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య హాజరై మాట్లాడారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన బీజేవైఎం నాయకులు చిగుళ్ల బాలరాజు సీపీఐ(ఎం)లో చేరారు. చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నాయకులు తమ్మినేనికి నాగలి బహూకరించారు. తుర్కపల్లి మండలానికి చెందిన పార్టీ నాయకులు తమ్మినేని మెమోంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర బృందం సభ్యులతో కూడిన ఫొటోను మెమోంటోగా తయారు చేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పార్టీ అనుబంధ సంఘాల వారు హాజరై విజయవంతం చేశారు. బహిరంగ సభకు డప్పు వాయిద్యాలతో, బోనాలతో స్వాగతం పలికారు. కళాకారులు నత్య ప్రదర్శన చేయగా, ప్రజానాట్యమండలి కళాకారులు తమ పాటలతో సభికులను ఉత్తేజపరిచారు. కరోనా రెండో దశ విజంభిస్తున్న సమయంలో జిల్లాలోని రెండు మండలాలను భవిష్యత్తులో పాదయాత్ర నిర్వహించనున్నట్టు పాదయాత్ర రథసారధి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ తెలిపారు. ఈ జన చైతన్య పాదయాత్ర ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని రంగాలలో వెనుకబడి ఉందని విద్య, వైద్యం, పర్యాటక రంగం ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో రైతులకు సాగు ,తాగునీరు అందించడంలో కూడా వెనుకబడిందని ఈ సమస్యలపై భవిష్యత్తులో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని సభలో ప్రకటించారు. మే నెలలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి, జూన్ నెలలో నిరాహార దీక్షలు చేపట్టి, కలెక్టరేట్ భవనాన్ని అష్టదిగ్బంధనం చేయనున్నట్టు తెలిపారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకుంటే రాష్ట్ర కమిటీ అనుమతి తో ప్రగతి భవన్ ముట్టడి ఇస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీరాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, బాట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రా రెడ్డి, ధీరావత్ రమేష్ నాయక్, జిల్లా కమిటీ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి , మంగ నర్సింహులు, జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, సిర్పంగి స్వామి, ఆనగంటి వెంకటేశ్, బొడ్డుపల్లి వెంకటేశం, వనంరాజు, పట్టణ, మండల కార్యదర్శులు మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.