Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య
నవతెలంగాణ -భువనగిరిరూరల్
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపట్టిన జన చైతన్య పాదయాత్ర జిల్లాలో అంతరించిపోతున్న చేతి వత్తిదారుల సమస్యలను వెలికితీసిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య అన్నారు. శనివారం జనచైతన్య పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కులాంతర వివాహాలకు వ్యతిరేకంగా పోరాడింది సీపీఐ(ఎం) అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో హామీలు అమలు చేయకపోవడంతో హామీలను నిలదీయడానికి జనచైతన్య పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేశారని అన్నారు. నందనం గ్రామంలో తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, కార్మికులకు ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. జన చైతన్య పాదయాత్ర భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.