Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే పరిశ్రమలు ఎక్కువగా కలిగిన ప్రాంతం భువనగిరి ప్రాంతమని ఇక్కడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఏర్పాటు చేయాలనిసీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనచైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా సీపీఐ(ఎం) కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూలి కోసం పొట్ట చేతబట్టుకొని వస్తారన్నారు. వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక, నల్గొండకు వెళ్లే లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. పీఎఫ్ఎన్ ఫోర్స్మెంట్ కార్యాలయం, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. బీడీ కార్మికులకు ఇచ్చే జీవనభతి ఆలేరు యాదగిరిగుట్ట, రాజాపేటలో టీిఆర్ఎస్ కార్యకర్తలే పొందుతున్నట్టు విమర్శించారు. గతంలో బునాదిగాని కాల్వ గురించి 2005 సంవత్సరంలో మక్త అనంతరం నుంచి భువనగిరి మండలం ఎర్రబెల్లి వరకు పాదయాత్ర చేస్తే అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం రూ.ఐదు కోట్లు విడుదల చేసిందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కాలువ పూర్తి కాకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రైతులకు తాగు ,సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అందుకు ఉదాహరణ ఈ కాలువే అని తెలిపారు.