Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ -భువనగిరి రూరల్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాట వేదిక జనచైతన్య పాదయాత్ర అని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం యాదాద్రి భువనగిరి జిల్లాలో 26 రోజులుగా జనచైతన్య పాదయాత్ర సందర్భంగా ఇప్పటికీ జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలు, వారు కనీసం స్నానం చేయడానికి బాత్ రూమ్, మరుగుదొడ్లు లేని సౌకర్యం దుస్థితి నెలకొందని అన్నారు. జనచైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా సీపీఐ(ఎం) కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మోటకొండూరు మండలం పిట్టల గూడెంలో ఇల్లు లేని నిరుపేదలు, వారు కనీసం స్నానం చేయడానికి బాత్ రూమ్, మరుగుదొడ్లు లేవన్నారు. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు అభివద్ధి పేరు చెబుతూ గొప్పలు చెప్పుకోవడం కాదు ఇలాంటి సమస్యలపై దష్టి పెట్టాలని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రభుత్వ భూములను రామన్నపేట వెల్లంకి, వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో ప్రభుత్వం తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలోని బొల్లేపల్లి, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి ,బునాదిగానే కాల్వ పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగితే జిల్లాలో ఆరు వేల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బీబీనగర్ ,పోచంపల్లి ,భువనగిరి, చౌటుప్పల్ మండలాలలో పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల యాజమాన్యాలపౖౖె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.