Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ముఖ్యమంత్రి కేసీిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దళిత గిరిజనులకు మూడెకరాల భూ పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనచైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం సీపీఐ(ఎం) కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎస్సీ జనాభా 17 మండలాల్లో లక్షా30 వేల మంది ఉంటే, 30 వేల కుటుంబాలు ఉండగా వారిలో 14 వేల కుటుంబాలకు సెంటు భూమి లేదన్నారు. భూ పంపిణీ కేవలం 82 కుటుంబాలకు 168 ఎకరాలు మాత్రమే ఇచ్చారని అన్నారు. భూ పంపిణీ అంటే కొన్ని ఇవ్వడం కాదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేద దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 2005లో కమ్యూనిస్టు పోరాట ఫలితంగా ఏర్పడిన ఉపాధి హామీ చట్టం నేడు పల్లెల్లో కూలీలకు వరంగా మారిందని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని తెలిపారు. ప్రభుత్వం కూడా ఈ నిధులను ఇతర అభివద్ధి పనులకు కేటాయిస్తుందని విమర్శించారు. ఉపాధి కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పనిదినాలు కల్పిస్తూ రోజుకు 257 రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కేరళ రాష్ట్రం తరహాలో 17 నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు.