Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఎర్రజెండా పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం లభిస్తుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి అన్నారు. జనచైతన్య పాదయాత్ర ముగింపు సందర్భంగా శనివారం సీపీఐ(ఎం) కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాటాలు చేయడానికి ప్రజలను సిద్దం చేసే కార్యక్రమంలో భాగంగానే జనచైతన్య యాత్ర నిర్వహించారన్నారు. నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అవేమి ఇప్పటివరకు అందలేదన్నారు. దళిత గిరిజనులకు మూడెకరాల భూమి లేదన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లేవన్నారు. ప్రస్తుతం మూడు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాలు మాటలు చెప్పి తప్పించుకునే పనిలో ఉన్నాయన్నారు.మోసాలను గ్రహించి ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని , సీపీఐ(ఎం) అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.