Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్బన్ కాలన కి ఫ్లైఓవర్, ఐటీఐ ప్రభుత్వ కళాశాల వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ -భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి ప్రాంతంలో అర్హులైన ప్రజలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జనచైతన్య పాదయాత్ర భువనగిరికి చేరుకున్న సందర్భంగా భువనగిరిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. పట్టణంలోని బహర్ పేట, రాంనగర్, హౌసింగ్ బోర్డు కాలనీ తోపాటు పట్టణంలో పలు ప్రాంతాలను సందర్శించి మాట్లాడారు. భువనగిరి జిల్లా కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ఇండోర్ పేటీఎంకు కేటాయించిన డబ్బును ఖర్చు చేసి, అవుట్డోర్ స్టేడియం నిర్మించాలని కోరారు. జిల్లాలో మటన్ దుకాణదారులు అందరికీ ఒకే చోట దుకాణాలు నిర్మించి ఇవ్వాలన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లపట్టాలు అందజేసి , ఇండ్ల స్థలాలు చూపించగా పోవడం దారుణమన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ భవనానికి మరిన్ని నిధులు ఖర్చు చేసి, భవనాన్ని గ్రంథాలయంగా మార్చాలని కోరారు. పట్టణవాసులకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని సౌకర్యాలతో మోడల్ పార్క్, మోడల్ మార్కెట్లు నిర్మించాలని కోరారు. అర్బన్కాలనీకి ఫ్లైఓవర్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్దఅందర్పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమాడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాలరాజ్ గౌడ్, కల్లూరి మల్లేశం, బట్టు పల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గిరిజన సంఘం నాయకులు రమేష్ నాయక్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, పట్టణ మండల కార్యదర్శి మయ కష్ణ, దయ్యాల నరసింహ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, యూటీఎఫ్, ప్రజా నాట్య మండలి, వికలాంగుల సంఘం, జీఎంపీఎస్, సీఐటీయూ, నాయకులు పాల్గొన్నారు.