Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : మున్సిపల్ కేంద్రంలోని రామసముద్రం రోడ్ వద్ద గల వరిచేలలో పందుల స్వైరవిహారం చేస్తున్నా యని, పందులు పెంచుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన రైతు ఆరుజుల జనార్దన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. తన స్వంత భూమి సర్వే నెంబర్ 8.13 లో వరి చేల తో పాటుపాడి పశువులకోసం కొత్రి గడ్డి విత్తినట్టు తెలిపారు. పట్టణానికి చెందిన మల్లయ్య, యాదగిరి పందులు సాకుతున్నాడని వరి చేల లోనికి గుంపులుగా వచ్చి పంట చేలనిధ్వంసం చేస్తున్నాయని పేర్కొన్నారు. అటుగా వెళ్లిన మనుషులపై తిరగబడుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ రెవెన్యూ అధికారులు, పోలీసులకు వినతిపత్రం అందజేసినట్టు పేర్కొన్నారు. ు పందుల పెంపకం దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ,తనకు తగిన పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు.