Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాల్లోనే పేరుకుపోయిన ధాన్యం నిల్వలు
- కనీస వసతులు లేక రైతుల ఇబ్బందులు
నవతెలంగాణ-నాంపల్లి
అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామని కేంద్రాలకు తీసుకొస్తే అధికారులు కొనుగోలు చేయకుండా వారిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వారం రోజుల క్రితం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ నేటి వరకూ కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో కేంద్రంలో ధాన్యపు రాశులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. అధికారులు ప్రతి రోజూ ఎవరో ఒకరు వచ్చి మ్యాచర్ చూసి వెళ్తున్నారే తప్ప ఎప్పుడు కొనుగోలు చేస్తారో చెప్పడం లేదు. అసలు అకాల వర్షాలు పడుతుండడంతో ధాన్యం ఎక్కడ తడిచి పోతుందోనని రైతులు భయాందోళనకు గురవుతున్నారు.
కనీస సౌకర్యాలు కరువు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కనీస అవసరాలైన నీడ, మంచి వసతులు ఏర్పాటు చేయలేదు. ధాన్యం ఎండ పెట్టుకోవడానికి, వర్షం వస్తే కప్పడానికి పట్టాలు, కవర్లు ఏర్పాటు చేయాల్సిన అధికారులు వాటి గురించి మర్చి పోయారు. దీంతో రైతులే స్వయంగా కిరాయికి తెచ్చుకుని ధాన్యంపై కప్పుతున్న పరిస్థితి ఉంది.
రైతు : సపావట్. శ్రీను
గ్రామం :జాన్ తండా
ధాన్యం మార్కెట్కు తెచ్చి వారం రోజులు దాటింది. అధికారులు అప్పుడప్పుడు వచ్చి మ్యాచర్ చూసి వెళ్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని తీసుకోవడం లేదు. కేంద్ర ంలో రైతులకు ఎలాంటి సౌకర్యాలూ కల్పించడం లేదు. ముఖ్యంగా మహిళా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.