Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
హోం ఐసోలేషన్లో ఉన్నవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, పట్టణ కార్యదర్శి ఎంఏ ఎక్బాల్ అన్నారు. శుక్రవారం పట్టణకేంద్రంలో నూతన కమిషనర్ జి.లావణ్యలతను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్లు, చైర్మెన్, కమిషనర్ ఐక్యంగా ఉండి ఆలేరు పట్టణాన్ని అభివద్ధి పథంలో నడిపించాలని కోరారు. ప్రస్తుత కరోనా ఐసోలేషన్లో ఉన్నటువంటి కుటుంబాల ఇండ్ల నుండి చెత్తను తొలగించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి మనోధైర్యం కల్పించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేమాన్ శ్రీనివాసులు, చెన్నై రాజేష్ ,తదితరులు పాల్గొన్నారు.