Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆలేరు మున్సిపల్ పట్టణ అభివద్ధికి కతనిశ్చయంతో పనిచేస్తానని మున్సిపల్ కమిషనర్ జి.లావణ్యలత అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మెన్ వసపరి శంకరయ్య అధ్యక్షతన పరిచయవేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ రీత్యా గతంలో వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. గత అను భవాలను ఆలేరు పట్టణాభివద్ధికి జోడిస్తానని చెప్పారు. ముఖ్యంగా పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. పట్టణ సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు . విద్యుత్ దీపాల పనులు పూర్తి చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బింగి లతా రవి ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాయపురం నర్సింహులు, కౌన్సిల్ సభ్యులు సీసా రాజేష్,ఎండీ రియాజ్ ,బ్యూలా రాణి ,ఎర్ర దేవదానం యాదగిరి నాగరాజు మున్సిపల్ సిబ్బంది యాదగిరి , రవి ,తదితరులు పాల్గొన్నారు.