Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువుర్ని మోసం చేసిన వ్యక్తి పోలీసులు శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని భవానీనగర్‌లో నివాసం ఉండే ఒక వివాహిత మహిళ, ఆమె కుమారుడికి సూర్యాపేట లోని గవర్నమెంట్ హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్, హయత్‌నగర్‌లోని ట్రెజరీ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తానే తయారు చేసి బాధితులకు ఇచ్చాడు.నల్లగొండకు చెందిన ప్రభుత్వ వెటర్నరీ అసిస్టెంట్ బొట్టు స్వర్ణకుమార్ అలియాస్ కిరణ్‌కుమార్ దాదాపుగా 10 ఏండ్ల నుండి రూ.30,00,000 నగదును వసూలుచేసి పలు మోసాలకు పాల్పడ్డాడు.దీంతో శుక్రవారం పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై రవీందర్ నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించి అతడి వద్ద నుండి ఒక కారు, చరవాణి విలువైన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.గతంలో స్వర్ణకుమార్ ఉద్యోగంలో అవకతవకలకు పాల్పడినందున ఉద్యోగం నుండి 2006లో రిమూవల్ చేశారు.అతనికి సహకరించిన కొంపెల్లి లింగయ్యను కూడా న్యాయస్థానంలో హాజరు పరచి జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు.