Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులూ పెట్టకుండా కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. గురువారం రాత్రి భారీ ఈదురుగాలులు, వర్షంతో కేంద్రాల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి పోయిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తేమ, తాలు పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయక పోతే రైతులను సమీకరించిన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు వేముల లింగస్వామి, వరికుప్పల ముత్యాలు, మిర్యాల భరత్ పాల్గొన్నారు.