Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత చికిత్స అందించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి సతీష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ పేద ప్రజలకు కరోనా వైరస్ సోకితే ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉందన్నారు. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా ద్వారా మృతి చెందిన వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు తోటపల్లి మల్లేష్, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సురకారపు సత్యం గౌడ్, యువజన సంఘం మండల అధ్యక్షులు కోమల బాలకృష్ణ, కడారి తిరుపతయ్య, మధు, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజా రమేష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనాకు ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర రామ్ సింగ్ నాయక్, ఉమర్, నవీద్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు గౌతమి, నాగరాజు, ప్రధాన కార్య దర్శులు వివిఆర్, సుజిత్ యాదవ్, రమేష్ నాయక్, పాండునాయక్, పొట్ట ప్రవీణ్ కుమార్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.