Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా మంచినీటి వ్యాపారం చేస్తున్న నీటి సరఫరా యజమానులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పట్టణ రెండవ కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంవీఎన్ భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిలా ్లకేంద్రంలో నీటి సరఫరా వ్యాపారం జోరుగా సాగు తోందన్నారు.వీధివీధిన మున్సిపాలిటీ అనుమతి లేకుండా రెండు,మూడు వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేసి అక్రమంగా మంచినీటిని వ్యాపారం చేస్తూ ప్రజల నుండి సొమ్మును దండుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వేసవికాలం అయినందున నీటి సరఫరా చేసే యజమానులంతా కుమ్మక్కై 20 లీటర్ల నీటి డబ్బాకు రూ.10, ,చల్లటి ప్రాంతంలో ఉంచిన డబ్బాకు రూ.50 చొప్పున దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.కానీ వాటర్ ప్లాంట్ల యజమానులు మాత్రం నాణ్యతాప్రమాణాలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు పచ్చమట్ఠల పెంటయ్య,వెంకట్రెడ్డి,శ్రీను,నగేష్ పాల్గొన్నారు.