Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మోటకొండూర్
మండలంలోని ముత్తి రెడ్డిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు గురువారం రాయగిరి-మోత్కూరు రహదారిపై ధర్నా నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల్లో నింపి మూడు రోజులు గడుస్తున్నా లారీలు రాలేదన్నారు. పంటను అమ్మడానికి నానా తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లారీల కొరత లేకుండా చూడాలని కోరారు. ధర్నాతో భారీగా ట్రఫిక్ జామ్ కావడంతో సంఘటనా స్థలానికి ఎస్సై. డి. నాగరాజుచేరుకుని రైతులకు నచ్చ చెప్పడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ కో కన్వీనర్ తుమ్మల మురళీధర్ రెడ్డి ,ఆత్మకూర్ జెడ్పీటీసీ నరేందర్ గుప్తా, ఎంపీటీసీ చాడ ప్రతిభ రెడ్డి, బీజేపీమండల అధ్యక్షుడు ఎల్లేష్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బచ్చే రాములు, సీనియర్ నాయకులు చాడ శశిధర్ రెడ్డి,ఆత్మకూర్ పీఏసీఎస్ వైస్ చైర్మెన్ గంధ మల్ల జహంగీర్, సీపీఐ నాయకులు కంచర్ల మల్లయ్య,టీిఆర్ఎస్ నాయకులు ఆడెపు స్వామి, రైతులు విట్టల్ రెడ్డి, కంచర్ల మల్లయ్య ,గుర్రాల శ్రీను, దశరథ, మల్లేష్, కిష్టయ్య, సైదులు రెడ్డి,నర్సింహ, స్వామి,కుమార్ ,స్వామి, బిక్షపతి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.