Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
పట్టాపాస్‌బుక్కులు ఇవ్వకపోవడంతో మండంలోని వంగపల్లి గ్రామానికి చెందిన మహిళ శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధితురాలు సృజన విలేకర్లతో మాట్లాడుతూ తనకు వారసత్వ ఆస్తిగా వంగపల్లి గ్రామంలోని 340 సర్వేనెంబర్లో ఎకరం 30 గుంటల భూమి ఉందన్నారు. ఈ భూమిని రెవెన్యూ అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా వేరేవ్యక్తికిి అక్రమంగా పట్టా చేశారన్నారు. ఈ విషయంపై ఇంతకుముందే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. వారసత్వంగా వచ్చిన తన భూమికి పాస్బుక్కు ఇవ్వకుండా అధికారులు అక్రమంగా పట్టా చేసిన వ్యక్తులకు పాస్‌బుక్కులు ఇచ్చారన్నారు. ఈ విషయమై తహశీల్దార్‌కు వినతి పత్రం కూడా సమర్పించామన్నారు. తన భూమిని తనపై చేసేందుకే రెవెన్యూ అధికారులు లక్షా ఇరవై వేలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. తనకు పాస్‌బుక్కులు ఇవ్వకుండా ఇతరులపై పట్టా చేసి వారికి పాస్‌బుక్కులు ఇచ్చారని తెలిపారు. తనకు న్యాయం జరగదని భావించే శానిటైజర్‌తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు న్యాయం చేసినా భూమిలో వేరే వ్యక్తికి ఇచ్చిన పాస్‌బుక్కులు రద్దు చేయాలని, తనకు పాస్ బుక్కు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు
స్లాట్ బుక్ అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే : తహసీల్దార్ అశోక్‌రెడ్డి
ధరణి వచ్చాక స్లాట్ బుక్ అయితే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఆపే అధికారం మాకు లేదు. మహిళ ఆత్మహత్యాయత్నం పై వివరిస్తూ స్లాట్ బుక్ అయిన భూమిలో వివాదం ఉందని కొనుగోలుదారులకు తెలిపాం. అయినా వారు చేయమని చెప్పడంతో రిజిస్ట్రేషన్‌కు సిద్ధమయ్యాం. మహిళా రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆత్మహత్యాయత్నం చేయడంతో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ వాయిదా వేశాం. పైఅధికారులకు ఈ విషయంపై నివేదిక పంపాం.