Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
జిల్లా పరిధిలోని ఏడు మండలాలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8మంది డాక్టర్లను హైదరాబాద్‌కు డిప్యుటేషన్ పేరుతో పంపడం ఏమిటని, జిల్లాలో కరోనా విస్తరిస్తున్న సమయంలో డిప్యూటేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శ జహంగీర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆర్డర్‌ను నిరసిస్తూ గురువారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు కరోనా తీవ్రంగా జిల్లాలో విస్తరిస్తుంటే జిల్లాపరిధిలో అధికంగా డాక్టర్లను నియమించాల్సి ఉందిపోయి ఉన్న డాక్టర్లను డిప్యుటేషన్ పంపించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికే ఒక్కో మండలంలో 100 నుండి 200 వరకు ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ కు డిప్యూటేషన్ పేరుతో పంపించడాని చూస్తే జిల్లా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈనెల 30 జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో వార్డులు, యూనిట్‌గా చేసి సరైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, బట్టుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి నాయకులు బండారు శ్రీరాములు,ఎదూనురి మల్లేశం పాల్గొన్నారు.