Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవ తెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం రూ.100 కోట్లు వెంటనే కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ కరోనా టెస్టులకు వందలాది మంది క్యూలైన్లో నిలబడుతున్నారని, కిట్లు లేకపోవడంతో తిరిగి వెనుదిరిగి పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కరోనా కట్టడికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని కాకి లెక్కలు చెప్పడం కాదు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం టెస్టుల సంఖ్య పెంచాలని, టీకాను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేస్తున్నారన్నారు. డాక్టర్ల కషి అభినందనీయమన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 150 మంది క్యూలైన్లో ఉంటే 30 కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి
బీబీనగర్ : కోవిడ్ టెస్టుల కోసం వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి పేషెంట్‌కు ర్యాపిడ్ లేదా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్‌చేశారు.